ETV Bharat / city

high court:'తనిఖీలకు వచ్చినప్పుడు అడ్డు చెప్పొద్దు'

అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అడ్డు చెప్పొద్దని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.మరోవైపు తనిఖీలకు వెళ్లే ముందు ఆ పరిశ్రమలకు నోటీసులు జారీచేయాలని ఏపీపీసీబీకి సూచించింది. తనిఖీ నివేదికలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

high court
హైకోర్టు
author img

By

Published : Jul 27, 2021, 4:01 AM IST

కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నిపుణులతో తనిఖీలకు వచ్చినప్పుడు అడ్డు చెప్పొద్దని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. తనిఖీలకు సహకరించాలని పేర్కొంది. మరోవైపు తనిఖీలకు వెళ్లే ముందు ఆ పరిశ్రమలకు నోటీసులు జారీచేయాలని ఏపీపీసీబీకి హైకోర్టు స్పష్టం చేసింది. తనిఖీ నివేదికలను కోర్టుకు సమర్పించాలని పీసీబీని ఆదేశించింది.

తనిఖీ నిర్వహణకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అమర్ రాజా బ్యాటరీస్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు , న్యాయవాది. ఎం.బాలాజీ ధర్మాసనానికి తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారన్నారు . తనిఖీలకు తాము సహకరించడం లేదంటూ పీసీబీ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో 8 మంది ఉద్యోగులను లెడ్ రహిత ప్రాంతంలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పీసీబీ జారీ చేసిన మూసివేత ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ , జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

పర్యావరణ నిబంధనలను పాటించలేదన్న కారణంతో పరిశ్రమ మూసివేత నిమిత్తం పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఆధీకృత అధికారి నాగుల గోపీనాథ్ రావు హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో ఏపీపీసీబీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు . తనిఖీలు జరగనీయకుండా యాజమాన్యం అడ్డుకుంటుందన్నారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తుందన్నారు. పరిశ్రమ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీది అయినందున వివాదాలకు తావులేకుండా ఐఐటీ నిపుణులతో తనిఖీలు చేస్తామన్నారు.

ఇదీ చదవండి

cm jagan జగన్‌ అక్రమ ఆస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.