ETV Bharat / city

స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - ఏపీలో స్థానిక ఎన్నికలు వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ముందుకెళ్లొచ్చని వ్యాఖ్యానించింది.

highcourt
author img

By

Published : Nov 16, 2019, 6:13 AM IST

గ్రామ పంచాయతీ, మండల , జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే ముందుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆ ప్రక్రియను నిలువరించలేమని తేల్చి చెప్పింది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లు వీలుకల్పిస్తున్నందున వాటిని రద్దు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై తీర్పు వచ్చే వరకు ఎన్నికలు నిలువరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి , పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి. శ్యాంప్రసాద్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. వ్యాజ్యం దాఖలు చేసిన గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కె . నవీన్ కుమార్ తరఫున న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రిజర్వేషన్​ 50 శాతానికి మించడానికి వీల్లేదని డాక్టర్ కె. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్లు అందుకు విరుద్ధంగా ఉన్నందున ఎన్నికలు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ ఎస్​. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియను కొనసాగనివ్వాలన్నారు . పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయటానికి గడువివ్వాలని అభ్యర్థించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీలిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చదవండి

మూడు కోడిగుడ్ల ధర 1672 రూపాయలా..?

ప్రత్యేక హోదాపై వాణి వినిపించాలి: సీఎం జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.