తెలుగుదేశం హయాంలో ఇచ్చిన గృహాల లబ్ధిదారులు ఇళ్ల పట్టాలకు అనర్హులుగా ప్రకటిస్తూ వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పీఎంఏవై-ఎన్టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనతో ఇళ్లపట్టాలు పొందలేకపోయిన కొంతమంది మంగళగిరి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. చిన్నచిన్న కారణాలు చూపి అనర్హులుగా ప్రకటించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది.
ఇదీచదవండి.