ETV Bharat / city

గవర్నర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తాం: న్యాయవాది లక్ష్మీనారాయణ

రాజధాని సంబంధిత బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై కోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. సరైన న్యాయ సలహాలు తీసుకోకుండానే ఆమోదముద్ర వేయటం సరికాదని అన్నారు.

high court advocate  laxminarayana
high court advocate laxminarayana
author img

By

Published : Jul 31, 2020, 10:49 PM IST

సరైన న్యాయ సలహాలు తీసుకోకుండానే గవర్నర్ మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదించారని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీనిపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కేసు మాదిరిగానే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.

రాజధాని అమరావతి రైతుల తరపున న్యాయపోరాటం చేస్తామన్న న్యాయవాది లక్ష్మీనారాయణ.... రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్టు కమిటీకి పంపించామని చెప్పారని... ఇప్పుడు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏది ఏమైనా న్యాయమే గెలుస్తుందని.. రాజధాని రైతుల పోరాటం గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.