తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో హీరోయిన్ కాజల్ సందడి చేశారు. నగరంలోని ఓ వస్త్రాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి సందడి చేశారు. భర్తతో కలిసి జ్యోతి వెలిగించి.. షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. వస్త్రాలయంలో కలియ తిరుగుతూ పలు డిజైన్ల దుస్తులను పరిశీలించారు. విభిన్న రకాల చీరలను ప్రదర్శిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కూమార్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్‌భాస్కర్‌తో కలిసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు.
అందాల తార కాజల్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కాజల్ జోష్ నింపారు. తెలుగులో మాట్లాడుతూ అభిమానుల్లో ఉత్సాహం పెంచారు. వరంగల్ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన భర్తకు వరంగల్ అంటే చాలా ఇష్టమని.. అందుకే తన వెంట వచ్చినట్టు అభిమానులతో పంచుకుంది. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న వరంగల్ వాసులకు, అభిమానులకు ముద్దగుమ్మ కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చూడండి:
cm jagan serious on fake challans: 'నకిలీ చలానాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయండి'