ETV Bharat / city

Sai Dharam tej Bike: సాయిధరమ్ తేజ్ బైక్ ప్రత్యేకతలేంటి..! ధరెంతంటే..!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. సుప్రీం హీరో సాయిధరమ్​తేజ్​ ద్విచక్రవాహన ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రమాద సమయంలో తేజ్​ నడిపిన ఆ స్పోర్ట్స్​ బైక్​ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అసలు తేజ్​ నడిపిన బైక్​ ఏంటీ...? దాని ధరేంత..? దాని ఫీచర్స్​ ఏంటీ..?

author img

By

Published : Sep 12, 2021, 3:43 PM IST

Features of Sai Tej Bike
సాయిధరమ్ తేజ్ బైక్ ప్రత్యేకతలు తెలుసా..?? ధరెంతంటే..??

మెగాస్టార్​ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్​తేజ్​ రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్​టాపిక్​గా మారింది. శుక్రవారం రోజు ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయిధరమ్​తేజ్​.. ఓ స్పోర్ట్స్​ బైక్​పై హైదరాబాద్ మాదాపూర్ లోని తీగల వంతెనపై నుంచి వస్తుండగా ప్రమాదం సంభవించింది. మెగా అభిమానులంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు చాలా మంది తేజ్​ వాడిన ట్రయంఫ్‌ స్పోర్ట్స్‌ వాహనం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

sai tej bike
సాయిధరమ్​తేజ్ ప్రమాదానికి గురైన బైక్​

ఆ బండి వివరాలివే...

సాయిధరమ్​ తేజ్​ వాడిన హై ఎండ్​ స్పోర్ట్స్​ బైక్‌ పేరు ట్రయంఫ్‌. మోడల్‌ పేరు స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌. ఆరుగేర్లు ఉండే ఈ వాహనం స్టార్ట్‌ చేసిన నాలుగు సెకన్లలో వంద కిలో మీటర్ల వేగానికి అందుకుంటుంది. ప్రత్యేకంగా రేసింగ్‌ల కోసమే దీన్ని డిజైన్‌ చేశారు. 45 డిగ్రీల కోణంలో బండిని ఒంపినా కూడా నియంత్రించుకునే సౌకర్యం ఉండటం ఈ బండి ప్రత్యేకత.

Saitej on bike at triumph showroom
ట్రయంఫ్‌ షోరూం ఓపెనింగ్​లో బైక్​పై తేజ్​
  • ఈ మోడల్‌ ధర అన్నీ కలిపి: రూ.12.80 లక్షలు
  • కూర్చునే సీటు ఎత్తు: 825 ఎంఎం
  • గంటకు అత్యధికంగా ప్రయాణించగల వేగం: 240 కిలోమీటర్లు
  • పెట్రోలు లీటరుకు మైలేజీ: 20 కి.మీ
  • సామర్థ్యం: 765 సీసీ
  • బరువు: 166 కిలోలు
  • ఇంధన సామర్థ్యం: 17.4 లీటర్లు
    riding on triumph bike
    ట్రయంఫ్‌ బైక్​పై రైడింగ్​ చేస్తూ...

ఆ బైక్​ ఎప్పుడు తీసుకున్నాడంటే...

సాయిధరమ్​ తేజ్​కు చిన్నప్పటి నుంచే బైకులంటే ఇష్టం. ఎవరికైనా గిఫ్ట్​లివ్వాలన్నా.. బైకులనే ఇవ్వటం తేజ్​కు అలవాటు. బైకులపై తేజ్​కున్న మక్కువను చూసి... గతంలో పవన్​కల్యాణ్​ కూడా అవెంజర్​​ను బహుమతిగా ఇచ్చారు. తేజ్​ వాళ్ల అమ్మ కూడా హై ఎండ్​ మోడల్​ హార్లీ డేవిడ్​ సన్​ బైక్​ను గిఫ్ట్​గా ఇచ్చారు. వారాంతాల్లో స్పోర్ట్​ బైక్​లపై.. స్నేహితులతో కలిసి లాంగ్​డ్రైవ్స్ వెళ్తుంటారు తేజ్​.​ ఎప్పటి నుంచో తనకు తానుగా.. ఓ మంచి స్పోర్ట్​ బైక్​ కొనాలనుకున్న సాయి... ఇటీవలే ట్రయంఫ్​ స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌ బైక్​ను కొనుకున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్​ ఎల్బీనగర్​కు చెందిన అనిల్​కుమార్​ అనే వ్యక్తి దగ్గరి నుంచి ఈ వాహనాన్ని ఐదు నెలల క్రితమే తీసుకున్నాడు.

సంబంధిత కథనాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.