ETV Bharat / city

ఉక్రెయిన్‌లోని తెలుగువారిని ఆదుకునేందుకు తెలంగాణ చర్యలు - దిల్లీ తెలంగాణ భవన్​లో సంప్రదించాల్సిన నెంబర్లు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. దిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ఏర్పాటు చేసి.. విదేశాంగ శాఖతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. అటు.. రాష్ట్ర భాజపా నేతలు సైతం.. బాధితుల పరిస్థితులను.. ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారు.

Helpline centers in Delhi
Helpline centers in Delhi
author img

By

Published : Feb 25, 2022, 1:27 PM IST

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిల్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరికీ వీలైనంత త్వరగా దేశానికి రప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Telangana Govt has established a helpline in Delhi at Telangana Bhavan, & also in Hyderabad at the General Administration (NRI) Dept, Telangana Secretariat, to help migrants & students from the state stranded in Ukraine. Contact numbers of the concerned officials are given below: pic.twitter.com/NifkElrsc3

    — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీతో పాటు.. సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్లు..

యుద్ధభూమిలో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం అందించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దిల్లీతోపాటు.. సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు.. సెక్రెటరేట్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సోమేష్ కుమార్ వెల్లడించారు.

దిల్లీ తెలంగాణ భవన్​లో సంప్రదించాల్సిన నెంబర్లు..

విక్రమ్​సింగ్​మాన్ : +91 7042566955

చక్రవర్తి పీఆర్​ఓ : +91 9949351270

నితిన్ ఓఎస్డీ : +91 9654663661

ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com

తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సి నెంబర్లు..

ఈ.చిట్టిబాబు ఏఎస్​ఓ : 040-23220603

ఫోన్ నంబర్ : +91 9440854433

ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in

భాజపా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్..

ఉక్రెయిల్‌లో చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించేందుకు... భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించి.. స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కరీంనగర్‌ జిల్లా కోతిరాంపూర్‌కు చెందిన మెడికల్ విద్యార్థి రోహిత్‌తో బండి సంజయ్ మాట్లాడి... భరోసా ఇచ్చారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన నిహారికరెడ్డి ఇంటికి వెళ్లి ఆమెతో ఫోన్‌లో మాట్లాడి.. తల్లిదండ్రులకు ధైర్యం కల్పించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.