కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ మన్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మోదుగులగూడెం, సజ్జలబోడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పంటపొలాలు, ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఆయా ప్రాంతాలవారు ఈ వాగు దాటడం తప్పనిసరి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని ఏళ్ల తరబడి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. ఉద్ధృతంగా వస్తున్న నీటిలో బండరాళ్లపై కర్రలు ఏర్పాటు చేసి వృద్ధులను, మహిళలను వాగు దాటిస్తున్నారు స్థానికులు. ఏ మాత్రం పట్టుతప్పినా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి పడుతున్న తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నా.. ఈ ప్రాంతంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఇదీ చదవండి:
ARREST: తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు చైనా పౌరులు అరెస్టు