ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వీటికి తోడు.. ఎగువ ప్రాంతాల్లోనూ పడుతున్న వానలతో.. జలాశయాలకు వరత పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 68,491 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా.. 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 844.90 అడుగులుగా నమోదైంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 69.90 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.
పరవళ్లు తొక్కుతున్న నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయానికి వరద తరలివస్తోంది. ఇన్‌ఫ్లో 28,815 క్యూసెక్కులుగా.. ఔట్‌ప్లో 972 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534.80 అడుగులకు చేసింది. గరిష్ఠ నీటినిల్వ 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 177.66 టీఎంసీల నీరు చేరింది.
జూరాలకు.. జలకళ
జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 58,600 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 66,090 క్యూసెక్కులుగా నమోదైంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.325 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.
ఇదీ చదవండి:
Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!