ETV Bharat / city

భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు... ఇళ్లలోకి వర్షపు నీరు - ఏపీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. బాపట్ల జిల్లా పర్చూరులో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయి. ఉప్పుటూరులో పంట పొలాల్లో వరద నీరు భారీగా చేరింది.

Rains
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
author img

By

Published : Oct 17, 2022, 12:24 PM IST

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొన్ని చోట్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పర్చూరు వాగు కట్టలు తెగి స్థానికంగా ఉన్న ఊర్లను ముంచెత్తుతోంది. రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో పర్చూరు వాగు పొంగి పొర్లుతోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగు సమీప ప్రాంతాలైన తూర్పు బజార్, ఉప్పుటూరులోని కాలనీతో పాటు పంట పొలాలలోకి వర్షుపు నీరు భారీగా చేరింది. దీంతో గ్రామస్తులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

వాగు పూడిపోవడం, చెట్లు మొలిచి అడవిలా మారడంతో నీరు ముందుకు వెళ్లక ఇళ్లలోకి చేరింది. అధికారుల పర్యవేక్షణ లోపం గ్రామస్థుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగు లోపల పెరిగిపోయిన గుర్రపు డెక్క, పూడిక, చిల్ల చెట్లను తొలగించాలని ముంపు ప్రాంతాల ప్రజలు.. వేడుకుంటున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కుండపోత వర్షం కురిసింది. కాలనీలన్నీ నీటితో నిండిపోయాయి. చేనేతల ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు.. చీరలు, సామగ్రిని పూర్తిగా తడిపేసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పట్టణంలోని ఇందిరానగర్, పాతపేట, డ్రైవర్స్ కాలనీ, తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్లాయి. చేనేత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. చేతికి వచ్చిన చీరలు నీటిలో తడిచిపోయి పనికిరాకుండా పోయాయని కన్నీరుపెట్టుకున్నారు.

కొందరి ఇళ్లల్లో నిత్యావసర వస్తువులు, బియ్యం, బెడలు, కూరగాయలు నీటిలో నానిపోయాయి. నాయకులు కేవలం ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారని, కాలనీలో ఉన్న సమస్యలు వారికి పట్టడంలేదని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలో తాము ఇబ్బందులు పడుతుంటే.. ఓట్లు వేయించుకున్న నాయకులు మాత్రం హాయిగా ఉన్నారన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.