తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుంది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: