ETV Bharat / city

అక్టోబర్​ నెలలోనూ ఈ కుండపోత వానలేందీ? - చలికాలంలోనూ భారీవర్షాలు తాజా వార్త

వర్షాకాలం ముగిశాక, అక్టోబరులో ఈ కుండపోత వర్షాలేంటనే ప్రశ్న అందరి మదినీ తొలుస్తోంది. దీనిపై వాతావరణ కేంద్రాలు, శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తున్నారు. గత మార్చి 22 నుంచి జులై వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో కాలుష్యం తగ్గడం- దీనివల్ల గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరగడం, వరుస అల్పపీడనాలతో నైరుతి రుతుపవాల నిష్క్రమణలో జాప్యం, షీర్‌జోన్లు ఇవన్నీ ప్రస్తుత అధిక వర్షాలకు కారణమని చెబుతున్నారు. దీనికితోడు ఫసిఫిక్‌ మహా సముద్రంలో ఏటా ఉండే ఎల్‌నినో(తక్కువ వర్షపాతానికి కారణమవుతుంది) ప్రభావం భారత ఉపఖండంపై ఈ ఏడాది ఏమాత్రం పడలేదని గుర్తించారు.

అక్టోబర్​ నెలలోనూ ఈ కుండపోత వానలేందీ?
అక్టోబర్​ నెలలోనూ ఈ కుండపోత వానలేందీ?
author img

By

Published : Oct 20, 2020, 10:25 AM IST

రుతుపవనాలు వెళ్లకపోవడం..
ఏటా జూన్‌లో కేరళ ద్వారా దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జులైకి రాజస్థాన్‌ వరకూ వెళతాయి. ఆ తరువాత సెప్టెంబరు నుంచి వెనక్కి నిష్క్రమిస్తాయి. ఇవి ఎంత త్వరగా నిష్క్రమించాయనే తేదీలను బట్టి వానాకాలం సీజన్‌ లెక్కలుంటాయి. గత 11 ఏళ్లలో ఒకే ఒక్కసారి 2018లో మాత్రమే అత్యంత ఆలస్యంగా సెప్టెంబరు 29న రాజస్థాన్‌ నుంచి వాటి నిష్క్రమణ ప్రారంభం కాగా తిరిగి ఈ ఏడాది అంతకన్నా ఒకరోజు ముందు అంటే గత నెల 28న వెనక్కి వెళ్లడం మొదలైంది. అవి మధ్యప్రదేశ్‌ వరకూ వచ్చేసరికి బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, అల్పపీడనాల గాలులు వాటి నిష్క్రమణకు అడ్డుచక్రంలా మారి అక్కడే ఆపేశాయి.

తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్తాయో చెప్పలేం..

దీంతో అవి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎప్పుడు నిష్క్రమిస్తాయనేది వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. అవి పూర్తిగా వెనక్కి వెళ్లాలంటే బంగాళాఖాతంలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఈ నెలలో ఇప్పటికే గత వారంలో ఒక అల్పపీడనంతో తీవ్రగాలులు, వర్షాలు కురిశాయి. మళ్లీ మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నందున మరో నాలుగైదు రోజుల వరకూ రుతుపవనాలు వెనక్కి కదలవని వాతావరణ శాస్త్రవేత్త రాజారావు వివరించారు. అవి పూర్తిగా వెనక్కి వెళ్లిపోతేనే వర్షాలు బాగా తగ్గిపోతాయని, లేకపోతే ఎక్కడో ఓ చోట కురుస్తూనే ఉంటాయని తెలిపారు. గత 11 ఏళ్లలో 2010, 2016లో మాత్రమే అక్టోబరు 28 వరకూ తెలంగాణలో రుతుపవనాల నిష్క్రమణ పూర్తికాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

అక్టోబరులోనూ షీర్‌జోన్లు
దీనికితోడు ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ప్రవాహ ద్రోణులు ఏర్పడుతున్నాయి. వీటిని వాతావరణ భాషలో ‘షీర్‌జోన్‌’ అని పిలుస్తారు. ఇలా గాలుల ప్రవాహం ఏర్పడినప్పుడు అవి పయనించే మార్గంలో వాతావరణం చల్లబడి తేమను తీసుకొస్తాయి. ఉదాహరణకు ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మంగళవారానికల్లా ఇది అల్పపీడనంగా మారే అవకాశముంది. ఇదే సమయంలో తూర్పు-పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఇదే ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. వరకూ వెళుతోంది. ఈ ఉపరితల ఆవర్తన గాలుల మధ్య నుంచి షీర్‌జోన్‌ వెళ్లడం వల్ల అక్కడ ఒత్తిడి మరింత పెరిగి అల్పపీడనం ఏర్పడటానికి ఎక్కువ అవకాశమేర్పడింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆవర్తన ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల వైపు తేమగాలులు మేఘాలతో వస్తున్నందున ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి వాతావరణం వానాకాలం (జూన్‌-సెప్టెంబరు మధ్య)లో ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఈసారి అక్టోబరులోనూ కొనసాగుతోంది.

తెలంగాణలో 46 శాతం అదనపు వర్షపాతం

భారతదేశంలో మొత్తం 36 రకాల వాతావరణ మండలాలున్నాయి. ఏటా సాధారణంగా ఈశాన్య భారతం, హిమాలయ పర్వత రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు కురిశాయి. ఈశాన్య భారతంకన్నా ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌తో స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడటం కూడా ఇందుకు ఒక కారణమని అంచనా. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య వానా కాలంలో దేశంలోకెల్లా అత్యంత ఎక్కువగా సౌరాష్ట్ర కచ్‌ సబ్‌డివిజన్‌లో సాధారణంకన్నా 126 శాతం, రాయలసీమలో 84, ఉత్తర కర్ణాటకలో 49, తెలంగాణలో 46 శాతం అదనపు వర్షపాతం కురిసింది. తెలంగాణలో ఇంత అధిక వర్షపాతం గత 33 ఏళ్లలో ఎన్నడూ నమోదు కాలేదు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి క్రైస్తవుడు అనేందుకు ఆధారాలేవి?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.