Hyderabad Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లిలో భారీ వర్షం కురవగా.. మురుగు నీరు రహదారిపైకి చేరింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపుర్ ప్రాంతాల్లో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా చేరడంతో లింగంపల్లి-ఓల్డ్ ముంబయి రోడ్డు వద్ద గల రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపు కురిసిన వర్షానికే రహదారులు జలమయమైతే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.
రాగల మూడు రోజులు భారీ వర్షాలు..: మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి అంతర్గత తమిళనాడు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ద్రోణి.. ఈ రోజు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.
ఇవీ చూడండి :
- బాపట్ల జిల్లాలో జనసేనాని.. ఆకట్టుకుంటున్న చిత్రాలు!
- పక్షి దెబ్బకు విమానంలో మంటలు.. టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...