ETV Bharat / city

అప్పుడూ జోక్యం చేసుకునే అధికారం లేదని చెప్పగలరా..?: హైకోర్టు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణాంశం పరిశీలనలో ఉండగా... ఎన్నికలు నిర్వహించాలని వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. ఎస్​ఈసీ నిర్ణయం తీసుకోకముందే వ్యాజ్యం దాఖలు చేశారని.. ఈ వ్యవహారంపై న్యాయసమీక్ష చేయొద్దని ఎస్​ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ న్యాయస్థానాన్ని కోరారు. ఎన్నికల నిర్వహణ ఎస్​ఈసీ బాధ్యత అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ వాదించారు. ఎన్నికల విషయంలో ఎస్​ఈసీ న్యాయస్థానానికి జవాబుదారీతనంగా ఉండాలన్నారు. ఇరువైపు వాదనలు ముగియగా... మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ప్రకటించారు.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Mar 21, 2021, 4:52 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎక్కడ నిలిచిపోయాయో.. అక్కడి నుంచి ప్రారంభించేలా ఎస్​ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ... గుంటూరు జిల్లా పాలపాడు గ్రామానికి చెందిన ఎం.రామిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై శనివారం జరిగిన విచారణలో ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పత్రికల్లో వచ్చిక కథనాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఎస్​ఈసీ రాజ్యాంగ విధిని నిర్వహించడం లేదనేది అవాస్తవమని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ అంశం పరిశీలనలో ఉందని కోర్టుకు వివరించారు.

ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకముందే కోర్టును ఆశ్రయించడం సరికాదని... నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయడం కోసం ఈ వ్యాజ్యం వేశారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఎస్ఈసీ స్వతంత్రతకు నష్టం కలుగుతుందన్న న్యాయవాది... నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఏవిధంగా ప్రశ్నిస్తారన్నారు.

ఎన్నికల విషయంలో ఎస్​ఈసీ అభిప్రాయాల్ని పేపర్​పై ఉంచలేం. ప్రజాబాహుళ్యంలో పెట్టలేం. ఎన్నికల కమిషనర్.. గవర్నర్​కు రాసిన లేఖను ఆధారంగా చేసుకొని ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గవర్నర్​కు కమిషనర్​కు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మూడు నెలలుగా లీక్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో వ్యాజ్యం వేశాం. ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేయడం ఎస్​ఈసీ స్వతంత్ర వ్యవహారం. వ్యాజ్యంలో జోక్యం చేసుకోవద్దు.-ఎస్​ఈసీ తరఫు న్యాయవాది

పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఈనెల 31తో కమిషనర్ పదవీకాలం ముగుస్తోందని... నిలిచిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి సమయం సరిపోతుందని న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కట్టుబడి ఉండాలని... ఎన్నికల్ని ఫలానా విధంగా నిర్వహించమని తాము కోరడం లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేయమని మాత్రమే కోరుతున్నామని కోర్టుకు వివరించారు.

ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పడం సరికాదు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో శాసనసభ స్పీకర్ నిర్దుష్ట కాలంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎస్​ఈసీ సైతం న్యాయసమీక్ష పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్నికల సంఘం రెండు నెలలు నిర్ణయం తీసుకోలేదనుకోండి... అప్పుడు కూడా న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం లేదని చెప్పగలరా..? అని ప్రశ్నించారు. నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండీ... ప్రైవేట్ సంస్థ చేతికి... ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.