ETV Bharat / city

JAGAN ASSETS CASE : "విచారణ జాప్యం చేసేందుకే.. హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు"

జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు సమయాన్ని బీపీ ఆచార్య వృథా చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సీబీఐ వాదించింది. తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బీపీ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్​పై నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

author img

By

Published : Dec 29, 2021, 10:05 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య.. విచారణను జాప్యం చేసేందుకే తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. కోర్టు సమయాన్ని బీపీ ఆచార్య వృథా చేస్తున్నారని వాదించింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్​లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనపై అభియోగాలు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ బీపీ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

ప్రభుత్వ అనుమతి లేదనడం సరికాదు..
అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. సీబీఐ కోర్టు అభియోగాలను స్వీకరించిందని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదించారు. ప్రాసిక్యూషన్​కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినందున.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదనడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అరబిందో, హెటిరో ఛార్జ్ షీట్​లోనూ బీపీ ఆచార్య పిటిషన్ కు ఇదే వాదన వర్తిస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.

అది పాలనాపరమైన విధాన నిర్ణయం..
రఘురాం సిమెంట్స్ కేసులో విశ్రాంత ఐఏఎస్ కృపానందం క్వాష్ పిటిషన్ పైనా తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. గనుల లీజును అంబుజా సిమెంట్స్​కు ఇవ్వకుండా రఘురాం సిమెంట్స్​కు ఇవ్వడం నేరమని సీబీఐ చెబుతోందని.. అది పాలనపరమైన విధాన నిర్ణయమని కృపానందం వాదించారు. కృపానందం పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.

ఇవీచదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.