Harish Rao Suspended a Doctor : హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ ఏరియా ఆస్పత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమను.. ఆస్పత్రి వైద్యుడు మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.. తక్షణం వైద్యుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి.. సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగంలో నిత్యం స్కానింగ్‌లు నిర్వహించాలన్న ఆయన.. అవసరమైన ఆల్ట్రా సౌండ్ యంత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు.
ఇవీ చదవండి: