ETV Bharat / city

హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ... ఆరు వారాల్లో పీపీఏ బకాయిలు చెల్లించాలని ఆదేశం

HC order on solar ppas
HC order on solar ppas
author img

By

Published : Mar 15, 2022, 4:23 PM IST

Updated : Mar 16, 2022, 6:18 AM IST

16:18 March 15

గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం బకాయిలు చెల్లించాలని ఆదేశం

త ప్రభుత్వ హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. బకాయిలు, భవిష్యత్తు ధరలు పీపీఏల్లో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి, డిస్కంలకు తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి సౌర, పవన విద్యుత్‌ యూనిట్‌ ధరను తగ్గించాలని కోరలేవని స్పష్టంచేసింది. యూనిట్‌ ధరలను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సమీక్షించేందుకు వీలు కల్పించడంతో పాటు, తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని, డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. ఆ తరహా ఉత్తర్వులివ్వడం సముచితంగా లేదని అభిప్రాయపడింది. మరోవైపు సౌర, పవన విద్యుత్‌ ధరలను సమీక్షించాలంటూ ఏపీఈఆర్‌సీ వద్ద డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదంటూ వాటిని కొట్టేసింది.

* మరోవైపు పవన, సౌర విద్యుత్‌ సంస్థలు చేస్తున్న ఉత్పత్తిలో కోత పెట్టవద్దని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ దాఖలుచేసిన అప్పీలును కొట్టేసింది. పవన, సౌర విద్యుత్‌ సంస్థలు తప్పనిసరి నిర్వహణ (మస్ట్‌ రన్‌) నిర్వచనం కిందకు వస్తాయంది. ఆ సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో కోత పెట్టడానికి వీల్లేదని, తప్పనిసరిగా డిస్కంలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కోత పెట్టవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.

* సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన అన్ని పెండింగ్‌ బకాయిలు, భవిష్యత్తు చెల్లింపులను పీపీఏలో పేర్కొన్న ధరల ప్రకారం ఆరు వారాల్లో చెల్లించాలని డిస్కంలను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం 79 పేజీల కీలక తీర్పు ఇచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు దాఖలుచేసిన అప్పీళ్లను అనుమతించింది.

..

నేపథ్యమిదే..

* గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్‌ ధరలను ఏపీఈఆర్‌సీ సమీక్షించేందుకు వీలుకల్పిస్తూ 2019 సెప్టెంబరులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీలు చేశాయి. తాత్కాలిక చర్యల్లో భాగంగా సౌరవిద్యుత్‌ యూనిట్‌కు రూ.2.44 (పీపీఏ ధర రూ.4.84), పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43 (పీపీఏ ప్రకారం రూ.5.99) చొప్పున బకాయిలు చెల్లించాలని సింగిల్‌ జడ్జి ఆదేశించడంపై అభ్యంతరం తెలిపాయి. మరోవైపు యూనిట్‌ ధరను సవరించాలని కోరుతూ ఈఆర్‌సీ వద్ద డిస్కంలు దాఖలుచేసిన పిటిషన్లను కొట్టేయడానికి సింగిల్‌ జడ్జి నిరాకరించడంతో విద్యుదుత్పత్తి సంస్థలు అప్పీళ్లు వేశాయి. నాలుగు అంశాలుగా విభజించి ఈ అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసి, మంగళవారం తుదితీర్పు వెల్లడించింది.

న్యాయస్థానాలు సవరించలేవు

న్యాయస్థానాలు ఒప్పందాలను సవరించలేవని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. పీపీఏల సమీక్షకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటుచేస్తూ ఇంధన శాఖ జారీచేసిన జీవో 63, తదనంతరం యూనిట్‌ ధరలను తగ్గించాలంటూ ఏపీఎస్పీడీసీఎల్‌ రాసిన లేఖను రద్దుచేసిన సింగిల్‌ జడ్జి.. తాత్కాలిక చర్యల్లో భాగంగా యూనిట్‌ ధరలను తగ్గించడం సరికాదంది. ఓ వైపు విద్యుత్‌ సంస్థల వ్యాజ్యాలను అనుమతిస్తూనే ధరలు తగ్గించాలని సింగిల్‌ జడ్జి పేర్కొనడాన్ని తప్పుపట్టింది. తాత్కాలిక చెల్లింపుల్లో భాగంగా ఉత్తర్వులివ్వడానికి సింగిల్‌ జడ్జి అధికరణ 226ని ఉపయోగించి ఉండాల్సింది కాదని పేర్కొంది. డిస్కంల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సింగిల్‌ జడ్జి రూ.2.44, రూ.2.43 చొప్పున చెల్లించాలని ఆదేశించి ఉండవచ్చని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు అనే కారణంతో ఒప్పంద నిబంధనల నుంచి పార్టీలు బయటపడటానికి వీల్లేదంది. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరలను వసూలు చేస్తూ.. డిస్కంలు ఆర్థిక ఇబ్బందులపై వాదన లేవనెత్తడానికి వీల్లేదంది. పీపీఏలోని నిబంధనలు, షరతులు ఇరుపార్టీల మధ్య రాసుకునేవని తెలిపింది. వాటిని న్యాయస్థానాలు సవరించడం లేదా తిరిగి రాయడం చేయలేవని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పీపీఏలను పార్టీలు కానీ, న్యాయస్థానం కానీ సవరించలేవని పేర్కొంది. డిస్కం, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా యూనిట్‌ ధరలను తగ్గించడానికి వీల్లేదని తెలిపింది.

ఏపీఈఆర్‌సీ సమీక్షించలేదు

* ఏపీఈఆర్‌సీ తన జ్యుడిషియల్‌ అధికారాలను వినియోగిస్తూ.. 2017 మార్చి 31కి ముందు (రెగ్యులేషన్‌-1 ప్రకారం) జరిగిన ఒప్పందాలన్నీ అమల్లో ఉంటాయని ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో 2017 మార్చి 31 తర్వాత జరిగే ఒప్పందాల్లో యూనిట్‌ ధరలను ప్రాజెక్టుల వారీగా వేర్వేరుగా నిర్ణయిస్తామని పేర్కొంది. అప్పటికే జరిగిన ఒప్పందాల్లో ఎక్కడా సమయానుగుణంగా ధరలను సమీక్షించవచ్చనే నిబంధన లేనందువల్ల పీపీఏల ప్రకారం 25 ఏళ్ల కాలానికి అంగీకరించిన ధరలనే అమలు చేయాలి. రెగ్యులేషన్‌-1 ప్రకారం అప్పటికే అమల్లోకి వచ్చిన ఒప్పందాల్లోని ధరను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి లేదు. ఈ నేపథ్యంలో యూనిట్‌ ధరలను సమీక్షించాలంటూ ఈఆర్‌సీ ముందు డిస్కంలు వేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదు. పీపీఏ అనేది విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, డిస్కంల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం. ఈ నేపథ్యంలో పీపీఏ ప్రకారం నిర్ణయించిన ధరలను చెల్లించాల్సిందే. పీపీఏల్లో సవరణలు చేయాలంటే ఇరుపక్షాల సమ్మతి మేరకు జరగాలే కానీ.. ఏకపక్షంగా లేదా గతంలో ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసిందనే ముసుగులో సవరించడానికి వీల్లేదు’ అని తేల్చిచెప్పింది.

* విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 62 అధికారాన్ని ఉపయోగించి యూనిట్‌ ధర మదింపు తర్వాతే పీపీఏ జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది.

* విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 86(1)(బి) ప్రకారం ధరలను సమీక్షించే అధికారం ఏపీఈర్‌సీకి ఉందన్న అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

* విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు పవిత్రమైనవని, ఒప్పందంలో నిర్దిష్టమైన నిబంధన ఉంటే తప్ప వాటిని పునఃసమీక్షించకూడదని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. పీపీఏలను సమీక్షించడంతో పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లుతుందని, భవిష్యత్తు బిడ్డింగ్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం చెప్పిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది.

* పీపీఏలను పరిశీలిస్తే టారిఫ్‌ సవరణ గురించి పేర్కొనలేదని తెలిపింది.

* టారిఫ్‌ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించిన ధరలు 25 ఏళ్లు అమల్లో ఉండేలా స్పష్టంచేశారని, ఈ నేపథ్యంలో టారిఫ్‌ను తగ్గించడం, సవరించడం ఏపీఈఆర్‌సీ చేయలేదని పేర్కొంది. సవరణ కోసం డిస్కంలు ఈఆర్‌సీ వద్ద వేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని చెప్పడానికి సందేహించట్లేదని తెలిపింది.

* సౌర, పవన సంస్థలు చేస్తున్న విద్యుత్‌లో కొత్తపెట్టడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని భావిస్తే, ఏ కారణంతో కోత పెట్టారో చెప్పాల్సిన బాధ్యత ఆ సంస్థపైనే ఉందని తెలిపింది. గ్రిడ్‌ భద్రతకు తప్ప.. మిగిలిన సమయాల్లో ఉత్పత్తిలో కోత విధించడం సరికాదంది.

ఆర్థిక ఇబ్బందులు అనే కారణంతో ఒప్పంద నిబంధనల నుంచి పార్టీలు బయటపడలేవు. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరలను వసూలు చేస్తూ.. డిస్కంలు ఆర్థిక ఇబ్బందులపై వాదన లేవనెత్తడానికి వీల్లేదు.- హైకోర్టు

పీపీఏల సమీక్ష నుంచి... హైకోర్టు ఉత్తర్వుల వరకూ..

రాష్ట్రంలో 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో పవన, సౌరవిద్యుత్‌ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాల్ని (పీపీఏ) సమీక్షిస్తామని ప్రకటించింది. ఆ నిర్ణయం సరికాదని కేంద్రం పదేపదే హెచ్చరించినా పెడచెవిన పెట్టి, పీపీఏల సమీక్షకు కమిటీని నియమించింది. దానిపై విద]్యుత్‌ ఉత్పత్తిదారులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి... విద్యుదుత్పత్తి సంస్థలకు పీపీఏల ప్రకారమే మొత్తం బకాయిలన్నీ ఆరు వారాల్లో చెల్లించాలని హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసే వరకూ చోటు చేసుకున్న పరిణామాలు ఇలా ఉన్నాయి..

2019 జూన్‌ 6: ఒకసారి చేసుకున్న సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్ని (పీపీఏ) బలమైన కారణం లేకుండా పునఃసమీక్షించాలనుకోవడం మంచిది కాదని, అది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్‌కుమార్‌ లేఖ. ప్రభుత్వ నిర్ణయం విద్యుత్‌రంగంలో పెట్టుబడిదారుల స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, రాష్ట్రంతో పాటు, దేశంలోనూ భవిష్యత్‌ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన.

2019 జులై1: గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలపై సమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులతో కమిటీ. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం.

2019 జులై 13: పీపీఏలపై సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కేంద్ర విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన వనరులశాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ లేఖ. ఒప్పందాల్ని గౌరవించడం లేదన్న అభిప్రాయం ప్రబలితే పెట్టుబడులు రావని వెల్లడి.

2019 జులై 15: పీపీఏల్ని కచ్చితంగా సమీక్షిస్తామని ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం స్పష్టీకరణ.

2019 జులై 23: పీపీఏల సమీక్ష వల్ల డిస్కంలకు ఆర్థిక కష్టాలు ఏర్పడతాయని క్రిసిల్‌ సంస్థ నివేదిక.

2019 జులై 25: పీపీఏల సమీక్ష నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు స్టే. ప్రభుత్వం నియమించిన కమిటీకి ఆ అధికారం లేదని స్పష్టీకరణ. ఏపీఈఆర్‌సీకి మాత్రమే ఆ అధికారం ఉంటుందని వెల్లడి. ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.63, విద్యుదుత్పత్తి సంస్థలకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ జులై 12న రాసిన లేఖ అమలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు.

2019 సెప్టెంబరు 9: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆధారాల్లేవని కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడి.

2019 సెప్టెంబరు 24: ఉన్నతస్థాయి కమిటీ నియామకానికి సంబంధించిన జీవో 63ని, విద్యుదుత్పత్తి సంస్థలకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ రాసిన లేఖను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు.

2019 సెప్టెంబరు 25: గత ప్రభుత్వం చేసుకున్న పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల మూడేళ్లలో రూ.5,500 కోట్ల నష్టం వాటిల్లిందని, దాన్ని సరిదిద్దడానికే పీపీఏల్ని సమీక్షించాలనుకున్నామని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ.

2019 సెప్టెంబరు 26: పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షను ఆపాలని ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ మరోసారి లేఖ. సౌర, పవన విద్యుత్‌ని థర్మల్‌ విద్యుత్‌తో పోల్చిచూడటం తగదని హితవు. అవినీతి జరిగినట్టు ఆనవాళ్లుంటే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప, ఆ పేరుతో మొత్తం ఒప్పందాలను సమీక్షిస్తే ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిక. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్‌ కొనుగోలు ధరల్లో పెద్దగా తేడా ఏమీ లేదని స్పష్టీకరణ.

2019 అక్టోబరు 10: పీపీఏల సమీక్షకు వీల్లేదని ఏపీ ప్రభుత్వానికి స్పష్టంచేసిన కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ.

* ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు పునఃసమీక్షించడం సరికాదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వ్యాఖ్య.

2021 మార్చి 25: పవన, సౌర విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని డిస్కంలకు హైకోర్టు ఆదేశం.

2021 ఆగస్టు 17: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేయాలన్న డిస్కంల నిర్ణయాన్ని నిలిపివేస్తూ విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు.

2022 మార్చి 15: విద్యుదుత్పత్తి సంస్థలకు పీపీఏ ధరల ప్రకారమే మొత్తం బకాయిల్ని ఆరు వారాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.

ఇదీ చదవండి: ఐపీఎల్​ లైవ్​పై హైకోర్టు కీలక తీర్పు- ఇక అవన్నీ బంద్!

Last Updated : Mar 16, 2022, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.