రాష్ట్రంలో 6,400 మెగా వాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ జారీచేసిన రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్, ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది జూన్ 17 న ఇచ్చిన తీర్పుపై ..హైకోర్టులో అప్పీళ్లు దాఖలు అయ్యాయి . ఏపీ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి , ఏపీజెన్ కో అప్పీలు వేయగా .. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ , ఎస్పీడీసీఎల్ మరో అప్పీలు వేశాయి . సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరాయి . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్య వద్దకు ఈ అప్పీళ్లు విచారణకు వచ్చాయి . కోర్టు ప్రారంభ సమయంలో అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అప్పీళ్ల గురించి ప్రస్తావన చేశారు . ధ్రువీకరించిన సింగిల్ జడ్జి తీర్పు ప్రతిని ప్రస్తుత అప్పీళ్లతో దాఖలు చేయలేదన్నారు . ఆ దస్త్రాన్ని దాఖలు నుంచి మినహాయించాలని కోరారు . ఆ మేరకు అనుబంధ పిటిషన్ వేశామన్నారు . అనుబంధ పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Loksabha Secretariat Notice: ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు
సౌరవిద్యుత్ ప్రాజెక్ట్ టెండర్ల రద్దు తీర్పుపై అప్పీళ్లు .. హైకోర్టులో విచారణ - ఏపీ వార్తలు
సౌరవిద్యుత్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ జారీచేసిన రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ , ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది జూన్ 17 న ఇచ్చిన తీర్పుపై ..హైకోర్టులో అప్పీళ్లు దాఖలు అయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్య వద్దకు ఈ అప్పీళ్లు విచారణకు వచ్చాయి.