ETV Bharat / city

hc on prc: జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తాం - పీఆర్సీ న్యూస

పీఆర్సీ అమల్లో భాగంగా.. ఏ ఉద్యోగి నుంచైనా జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తామని.. ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను..... ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించింది. పీఆర్సీ జీవోలన్నింటినీ.. పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.

hc on prc issue
hc on prc issue
author img

By

Published : Feb 24, 2022, 5:46 AM IST

పీఆర్సీ ఉత్తర్వులపై... ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ.కృష్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై.. హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి నుంచైనా...జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తామని..ధర్మాసనం స్పష్టం చేసింది. పీఆర్సీ విషయంలో జారీచేసిన జీవోలన్నీ.. పిటిషనర్ కేవీ.కృష్ణయ్యకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై....ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని...పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ వాదించారు. పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం....ఉద్యోగుల జీతాల నుంచి ప్రభుత్వం రికవరీ చేయనుందంటూ...ధర్మాసనానికి నివేదించారు. పీఆర్సీ విషయంలో.. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక సహా....ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవోలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు.

జీతం నుంచి రికవరీలు చేయడం లేదంటూ.....అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ బదులిచ్చారు. పీఆర్సీ నివేదికను కోర్టుకు అందజేస్తామని వాదించారు. పరిశీలన అనంతరం...పిటిషనర్‌కు ఇచ్చే వ్యవహారంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవచ్చన్నారు. న్యాయస్థానానికి మాత్రమే అందజేస్తామని చెప్పేందుకు ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. జీవోలను పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. కౌంటర్‌తో పాటు.. పీఆర్సీ నివేదికను కోర్టులో దాఖలు చేయాలన్న ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: Amaravati Protest: అమరావతి ఉద్యమానికి 800 రోజులు.. నేడు ప్రత్యేక కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.