రాష్ట్రంలోని కారాగారాల్లోని ఖైదీలు కరోనా బారినపడకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించాలని.. కరోనా బాధితులకు తగిన చికిత్స అందించాలని కోరుతూ న్యాయవాది జీవీ రవీంద్రకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సరైన చికిత్స అందించడం లేదని పిటిషనర్, అందిస్తున్నామని జీపీ చెబుతున్న క్రమంలో చికిత్స అందడం లేదనేందుకు రెండు ఉదాహణలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌కు స్పష్టంచేసింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: సీబీఐ అధికారులపై మహిళా ఎస్సై గూఢచర్యం!