మాజీమంత్రి వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో కడవ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులోని ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులన్నీ హైకోర్టుకు సమర్పించాలని మెజిస్ట్రేటు ఆదేశించింది . రిమ్స్ ఠాణా ఇన్‌స్పెక్టర్‌కు, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని రాంసింగ్ వేధిస్తున్నట్లు ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేయగా... దాని దర్యాప్తు నిమిత్తం మెమో రూపంలో కోర్టు ఠాణాకు రిఫర్ చేసింది . దీని ఆధారంగా పోలీసులు సీబీఐ ASP రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అడ్డుకునేందుకే ఉదయ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రామ్‌సింగ్ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు