తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ధూళిపాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీటీ స్కాన్ తదితర పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా నిర్ధరణ అయితే వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలోనైనా చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. గోపాలకృష్ణన్‌ను విజయవాడ ఆయుష్‌లో చేర్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండీ... పాల ప్యాకెట్ల కంటే ముందే మద్యమా..?: లోకేశ్