హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత సర్కారులా వైకాపా మెడకు చుట్టుకుంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనట్లుగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. 'హోదాకు బదులు పథకాలు, ప్రాజెక్టుల ద్వారా రూ.22 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది. కేంద్రానికి ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఉద్దేశం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని జగన్‌కు కూడా తెలుసు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుంది. రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదు. అమరావతిని మార్చడం సరికాదని భాజపా రాజకీయ తీర్మానం చేసింది.' అని జీవీఎల్ తెలిపారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం ఒప్పుకుంటుంది'