స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడాన్ని భాజపా స్వాగతించింది. వైకాపా దౌర్జన్యాలకు, మొండివైఖరికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సంఘానికే సర్వహక్కులు ఉంటాయని సుప్రీం తీర్పు మరోసారి రుజువు చేసిందని భాజాపా రాజ్యసభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైకాపా దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసిన చోట్ల మళ్లీ ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'కరోనాను సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయించారు'