ETV Bharat / city

AOB: ఏవోబీలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి - ఆంధ్రా ఒడిశా సరిహద్దు

gunfire between
gunfire between
author img

By

Published : Oct 12, 2021, 11:13 AM IST

Updated : Oct 12, 2021, 2:30 PM IST

11:12 October 12

మావోయిస్టులు మృతి, పోలీసుకు గాయాలు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఎదురుకాల్పులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ప్రకారం.. ఏవోబీలో మావోయిస్టుల క‌ద‌లికల‌పై పోలీసులకు స‌మాచారం అంద‌డంతో ఎస్‌వోజీ డీవీఎఫ్ పోలీసు బ‌ల‌గాలు ఒడిశాలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా మ‌త్లీ పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని తుల‌సి ప‌హాడ్ అట‌వీ ప్రాంతంలో గాలింపు బ‌ల‌గాల‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం మావోయిస్ట‌లు తార‌స‌ప‌డ‌టంతో.. పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెంద‌గా, ఒక పోలీసుకు తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ పోలీసును చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్​లో విశాఖ త‌ర‌లించారు. సంఘ‌ట‌న స్థ‌లంలో ఒక ఇన్సాస్ తుపాకీను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిసింది.  మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళా మావోయిస్టులు ఉన్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. మృతి చెందిన మావోయిస్టు ఏవోబీ ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలుగా ప్రాధమికంగా నిర్ధరణ చేశారు. సంఘ‌ట‌న స్థ‌లంలో గాలింపు జ‌రుగుతుంద‌ని, అద‌నంగా బ‌ల‌గాల‌ను సంఘ‌ట‌నా స్థ‌లానికి పంపిస్తున్నామ‌ని డీజీపీ అభ‌య్ తెలిపారు. 

ఇదీ చదవండి: భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా14,313 మందికివైరస్​

Last Updated : Oct 12, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.