తెలంగాణ గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి ఖరారయ్యారు. వరంగల్ 29వ డివిజన్ నుంచి ఆమె గెలుపొందారు. 36వ డివిజన్ నుంచి గెలిచిన రిజ్వానా షమీమ్.. డిప్యూటీ మేయర్ ఎంపికయ్యారు.
సుధారాణి, షమీమ్ పేర్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. కాసేపట్లో వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు 48 డివిజన్లలో తెరాస విజయం సాధించింది. భాజపా 10, కాంగ్రెస్ నాలుగు డివిజన్‌లలో గెలుపొందింది. ఇతరులు నాలుగు చోట్ల సత్తాచాటారు.
ఇవీ చూడండి: