కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తొలివిడతలో కొవిడ్ వ్యాక్సిన్ను వేసేందుకు ఆరోగ్యశాఖ సిబ్బంది వివరాలు తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలివిడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఆ శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు వివిధ వయస్సుల వారికి టీకాను వేసేందుకు అనువుగా డేటాబేస్ రూపొందించాలని ఆదేశాలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో డేటాబేస్ రూపొందించేందుకు మండలస్థాయిలో కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
తహసీల్దార్ నేతృత్వంలో 9 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో క్షేత్రస్థాయి కమిటీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కొవిడ్ టీకా వేసేందుకు స్టీరింగ్ కమిటీ, టాస్క్ఫోర్స్ కమిటీని ప్రభుత్వం నియమించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ రవాణా, నిల్వ, వాక్సినేషన్ కార్యక్రమం, జన సమూహాల నిర్వహణ, సమాచారం, తదితర అంశాలపై దృష్టి సారించాలని కమిటీలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది.
ఇదీ చదవండీ...