ETV Bharat / city

'భవిష్యత్ తరాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం-2020' - నూతన విద్యావిధానం-2020

నూతన జాతీయ విద్యా విధానం - 2020ను భవిష్యత్ తరాలకు అనుగుణంగా రూపొందించారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో జరుగుతున్న గవర్నర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు.

governor-conference-about-new-educational-palocy-in-india
గవర్నర్​ల సదస్సులో ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
author img

By

Published : Sep 7, 2020, 7:18 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యావిధానం-2020ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. 21 వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్య అవసరాలు, రానున్న సమస్యలను... ఈ కొత్త విధానం పరిష్కరించగలదని ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జరుగుతున్న గవర్నర్ల సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ ఆన్​లైన్ విధానంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని నూతన విద్యా విధానంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సాధించాలనే లక్ష్యంతో, నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోందని గవర్నర్‌ అన్నారు. పరిశోధనల్లో నాణ్యత, పేటెంట్ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తి హక్కులను ప్రోత్సహించే క్రమంలో.. జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. రాష్ట్రంలో సంస్థాగత పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి పరిశోధనా మండలిని ఏర్పాటు చేయటమే కాక, విద్యా సంస్ధలను పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

జాతీయ విద్యా విధానం-2020 సిఫారసులకు అనుగుణంగా ఆన్‌లైన్, డిజిటల్ విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ, మిశ్రమ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం... నూతన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని గవర్నర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యకు అవకాశం కల్పించడానికి, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల మధ్య సాంకేతికత లభ్యతలో అంతరాన్ని తగ్గించడానికి ఈ-లెర్నింగ్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారని వివరించారు. ఈ విధానం అమలు కోసం తగిన చర్యలు, మార్గదర్శకాలను సూచించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంబంధిత శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకే కొత్త విద్యావిధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.