ETV Bharat / city

varuna reddy:వరుణారెడ్డిని వెనక్కి పిలిచిన ప్రభుత్వం - varunareddy latest news

varuna reddy: కడప కేంద్ర కారాగార ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఇటీవల నియమితులైన వరుణారెడ్డిని ప్రభుత్వం అక్కడ్నుంచి తప్పించింది. ఒంగోలు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ఎన్‌హెచ్‌ ప్రకాశ్‌ను కడపకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలపై తాత్కాలికంగా నియమించింది. వరుణారెడ్డిని తాత్కాలికంగా ఒంగోలు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా అటాచ్‌ చేస్తూ జైళ్లశాఖ డీజీ హసన్‌ రజా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

వరుణారెడ్డిని వెనక్కి పిలిచిన ప్రభుత్వం
వరుణారెడ్డిని వెనక్కి పిలిచిన ప్రభుత్వం
author img

By

Published : Feb 16, 2022, 4:30 AM IST

varuna reddy: కడప కేంద్ర కారాగార ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఇటీవల నియమితులైన వరుణారెడ్డిని ప్రభుత్వం అక్కడ్నుంచి తప్పించింది. ఒంగోలు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ఎన్‌హెచ్‌ ప్రకాశ్‌ను కడపకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలపై తాత్కాలికంగా నియమించింది. వరుణారెడ్డిని తాత్కాలికంగా ఒంగోలు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా అటాచ్‌ చేస్తూ జైళ్లశాఖ డీజీ హసన్‌ రజా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవలి వరకు కర్నూలు జిల్లా కారాగార సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి.. ఫిబ్రవరి 3న కడపలో నియమితులయ్యారు.

గతంలో అభియోగాలున్న వరుణారెడ్డిని.. కావాలనే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులున్న కడప జైలుకు పంపిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ‘కడప కేంద్ర కారాగార ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా వరుణారెడ్డి’, ‘వరుణారెడ్డిపై అంతులేని ప్రేమ’ శీర్షికన ‘ఈనాడు’లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వరుణారెడ్డిని ఒంగోలుకు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. జైళ్లశాఖలో బదిలీలపై నిషేధం ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా అటాచ్‌మెంట్‌ ఇచ్చామని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

మొద్దు శీను హత్య ఘటనలో అభియోగాలు: పరిటాల రవీంద్ర హత్యకేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను 2008 నవంబరు 9న అనంతపురం జిల్లా కారాగారంలో హత్యకు గురైన సమయంలో వరుణారెడ్డి అక్కడ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్నారు. దీనిపై భద్రతాపరమైన అంశాల పర్యవేక్షణలో ఆయన విఫలమయ్యారని అభియోగాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే మొద్దు శీను బ్యారెక్‌లోకి ఓం ప్రకాశ్‌ను పంపించారని పరిటాల రవి హత్యకేసులో నిందితుడైన పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి అప్పట్లో అనంతపురం జిల్లా జడ్జికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వరుణారెడ్డికి రెండేళ్లపాటు ఇంక్రిమెంట్లను వాయిదావేయడంతోపాటు సస్పెన్షన్‌ కాలాన్ని విధుల్లో లేని కాలంగా పరిగణించాలని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వరుణారెడ్డి విజ్ఞప్తి మేరకు.. ఆయనపై తీసుకున్న శాఖాపరమైన చర్యలను కొట్టేస్తూ 2019 ఆగస్టు 29న ఉత్తర్వులు వెలువడ్డాయి.

కడప కారాగారంలో వివేకా హత్య కేసు నిందితులు: గత చరిత్ర నేపథ్యంలో వరుణారెడ్డిని కడప కేంద్ర కారాగార ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమించడం వివాదాస్పదం అయింది. వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ అదే జైలులో ఉన్నారు. దీంతో ప్రభుత్వం కావాలనే వరుణారెడ్డిని అక్కడ నియమించిందని విమర్శలు వచ్చాయి. ఆయన్ను అక్కడ నుంచి బదిలీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీబీఐకి మంగళవారం లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వరుణారెడ్డిని అక్కడ నుంచి పంపిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:

ఏబీజీ షిప్‌యార్డు ఛైర్మన్‌పై సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.