ETV Bharat / city

'42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చాం' - 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు

రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సంబంధిత ప్రతిని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ న్యాయస్థానానికి అందజేశారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నోటిఫికేషన్‌ జారీ ఒక్కటే సరిపోదని పేర్కొంది. న్యాయాధికారిని ఎలా నియమించాలి? న్యాయాలయాన్ని ఎక్కడ ఏర్పాటుచేయాలి? వారిపై నియంత్రణ ఎలా? తదితర అంశాలపై దృష్టిసారించాలని సూచించింది.

government issues ordinance to village courts
42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు
author img

By

Published : Mar 1, 2020, 2:45 PM IST

రాష్ట్రంలో ఉన్న న్యాయాధికారులు కాకుండా కొత్త పోస్టులు సృష్టించడం ఉత్తమమని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయాలయాలను ప్రస్తుతమున్న న్యాయస్థానాలకు దూరంగా ఏర్పాటుచేస్తే న్యాయవాదులు అభ్యంతరం లేవనెత్తే అవకాశం ఉన్నందున.. ప్రస్తుతమున్న కోర్టు ప్రాంగణంలోనే అదనపు న్యాయాలయం ఏర్పాటుచేయడం మంచిదని పేర్కొంది. ఇప్పటి నుంచి చర్యలు ప్రారంభిస్తే కనీసం ఏడాదికైనా అవి సేవలందించేలా సిద్ధమవుతాయని అభిప్రాయపడింది. వీటిపై పురోగతిని పరిశీలించేందుకు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలు జారీచేసింది.

ఇవీ చదవండి.. మంగళగిరి పురపాలికలో గ్రామాల విలీన జీవోపై హైకోర్టు స్టే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.