ETV Bharat / city

కరోనా మూడో దశ హెచ్చరికల దృష్ట్యా విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాలు - విద్యాశాఖ మార్గదర్శకాలు

కరోనా మూడోదశ హెచ్చరికలతో.. ప్రత్యామ్నాయ బోధనపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 15 మంది విద్యార్థులను బృందంగా ఏర్పాటుచేసి.. ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని నిర్దేశించింది. విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చే వరకు.. ఈ పద్ధతి కొనసాగించాలని స్పష్టంచేసింది.

Alternative Education
విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాలు
author img

By

Published : Jul 7, 2021, 8:38 AM IST

విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాలు

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థుల చదువుల పర్యవేక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు పాఠశాల రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ప్రధానోపాధ్యాయులు చర్చించేందుకు విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి సచివాలయం పరిధిలోని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్లు, తల్లిదండ్రులు కమిటీలను ఆహ్వానించాలని ప్రభుత్వం సూచించింది. సమావేశంలో విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆ బృందాలను పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులకు జత చేస్తారు. విద్యార్థుల సంఖ్య బృందంలో 15మందికి మించకుండా ఉండాలి. ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విద్యార్థులకు ఏ సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయో చూసుకొని, విద్యార్థుల్లో చురుకైన వారిని నాయకుడిగా నియమించాలి.

పాఠాల వివరాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలపాలి..

ఇంటి వద్దే పిల్లల చదువులను పరిశీలించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగిస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఒక పాఠశాలలో 15 మందికి మించకుండా విద్యార్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. ఒక్కొక్క బృందానికి ఒక ఉపాధ్యాయుడిని పర్యవేక్షకునిగా నియమిస్తారు. ఉపాధ్యాయులు.. తమకు కేటాయించిన బృందంలో ఏ సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయో చూసుకొని.. ఆ 15 మందిలో ఒకరిని నాయకుడిగా నియమించాలి. ఉపాధ్యాయ పర్యవేక్షణ లేని సమయంలో.. ఈ నాయకుడు విద్యార్థుల బృందం ప్రత్యామ్నాయ విద్యాభ్యాసనకు తోడ్పడేలా చూడాలి. అంతేకాకుండా విద్యార్థులకు అందించే బియ్యం, సరకుల ప్రయోజనాలు సకాలంలో అందించడంతోపాటు.. బడిబయట పిల్లలను గుర్తించి.. వారిని ఈ ప్రత్యామ్నాయ విద్యాభ్యాసంలో భాగస్వామ్యం చేయాలి. రాష్ట్రవిద్యాశాఖ ఈనెల 15 నుంచి ప్రసారం చేసే దూరదర్శన్, రేడియో పాఠాల వివరాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలపాలి. ఈ కార్యక్రమాలను తమ గ్రూపులోని విద్యార్థులందరూ వినియోగించుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. అదేసమయంలో గ్రంథాలయాల సౌకర్యాలను వినియోగించుకునే విద్యార్థులను ప్రోత్సహించాలి.

వర్క్‌షీట్లలో వివరాలు నమోదు చేయాలి..

ఈ కార్యాచరణను ప్రణాళికబద్ధంగా అమలు చేసేందుకు విద్యాశాఖ రోజు వారి ప్రణాళికనూ సిద్ధం చేసింది. విద్యార్థులకు సులభతర అభ్యసనను అందించేదుకు సర్వశిక్ష అభియాన్‌ ద్వారా వీడియో తరగతులు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు వీడియో తరగతులను సప్తగిరి ఛానల్‌ ద్వారా ప్రతిరోజు ప్రసారం చేయనుంది. ఏ విద్యార్థులు ఈ కార్యక్రమాలను వీక్షించారో సంబంధిత గ్రూపు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఈ నెల 15 నుంచి విద్యార్థులకు వర్క్‌షీట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వీటిని జిల్లా ఉమ్మడి పరీక్షా బోర్డుల ద్వారా పాఠశాలలకు అందిస్తారు. రేడియో, వీడియో పాఠాలు ప్రసారమైన తర్వాత విద్యార్థులకు వాటిపై వర్క్‌షీట్లు ఇస్తారు. వీటిని పిల్లలను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యంకనం చేసి, వాటి ఫలితాలను తల్లిదండ్రులు, విద్యార్థులకు తెలపాలి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఇచ్చిన వర్క్‌షీట్లే కాకుండా ఉపాధ్యాయులు అదనంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని అనుసరించి వర్క్‌షీట్లను రూపొందించుకోవాలి. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు ప్రస్తుత ప్రత్యామ్నాయ బోధన, అభ్యాసనపై అవగాహన కల్పించాలి.

ఉపాధ్యాయ, విద్యార్థుల గ్రూపులను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందించాలి. డిజిటల్, వర్చువల్‌ తరగతులను అందుబాటులోకి తీసుకురావాలి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు పైఅధికారులకు తెలియచేయాలి.

ఇదీ చదవండి:

MINISTER VS MLA: మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం... నివ్వెరపోయిన అధికారులు!

'కొవిడ్ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.