ETV Bharat / city

liquor:మద్యంపై వ్యాట్‌ తగ్గింది.. మార్జిన్‌ వచ్చింది

మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. మద్యంపై ఇప్పటివరకూ విధిస్తున్న వ్యాట్‌ను గణనీయంగా తగ్గించి.. ఆ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు కొత్తగా ప్రత్యేక మార్జిన్‌ను ప్రవేశపెట్టింది. ఫలితంగా వినియోగదారుడికి విక్రయించే ఎమ్మార్పీ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోయినప్పటికీ ఏపీఎస్‌బీసీఎల్‌కు లభించే మార్జిన్‌ మాత్రం భారీగా పెరగనుంది.

మద్యంపై వ్యాట్‌ తగ్గింది.. మార్జిన్‌ వచ్చింది

author img

By

Published : Nov 11, 2021, 4:37 AM IST

మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. మద్యంపై ఇప్పటివరకూ విధిస్తున్న వ్యాట్‌ను గణనీయంగా తగ్గించి.. ఆ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు కొత్తగా ప్రత్యేక మార్జిన్‌ను ప్రవేశపెట్టింది. ఫలితంగా వినియోగదారుడికి విక్రయించే ఎమ్మార్పీ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోయినప్పటికీ ఏపీఎస్‌బీసీఎల్‌కు లభించే మార్జిన్‌ మాత్రం భారీగా పెరగనుంది. ఈ మేరకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖలు తాజాగా రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి. వ్యాట్‌ సవరణకు సంబంధించి బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. బుధవారం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తాజా నిర్ణయంతో ఏపీఎస్‌బీసీఎల్‌ ఇప్పటివరకూ వ్యాట్‌ రూపంలో వాణిజ్యపన్నుల శాఖకు చెల్లిస్తున్న దాంట్లో కొంత మొత్తాన్ని ఇకపై చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలా మిగిలిన మొత్తం ఆదాయం అవుతుంది. ఈ మేరకు కార్పొరేషన్‌కు లభించే మార్జిన్‌ పెరుగుతుంది. మద్యం ఆదాయాన్ని హామీగా చూపించి ఏపీఎస్‌బీసీఎల్‌ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం రూ.వేల కోట్లు రుణాలుగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు ఎక్కువ ఆదాయం లభించేలా చేసేందుకు వీలుగా తాజాగా సవరణలు తీసుకొచ్చినట్లు ఉందని ఓ విశ్రాంత అధికారి వివరించారు. సవరణలకు కారణమేంటో వివరణ కోసం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవను ‘ఈనాడు’ ప్రతినిధి సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డితో ప్రస్తావించగా... ఈ విషయంలో తనను ఏమీ అడగొద్దని సమాధానమిచ్చారు.

* వివిధ కేటగిరీల మద్యంపై ప్రస్తుతం 130 శాతం నుంచి 190 శాతం వరకూ వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఆయా కేటగిరీలపై 35 శాతం నుంచి 60 శాతం వరకూ తగ్గించారు.

* ఇప్పటివరకూ మద్యంపై స్పెషల్‌ మార్జిన్‌ రేటు లేదు. వివిధ కేటగిరీల మద్యంపై 85 శాతం నుంచి 130 శాతం వరకూ స్పెషల్‌ మార్జిన్‌ రేటును కొత్తగా విధించారు.

* సాధారణంగా వ్యాట్‌ తగ్గిస్తే ఆ మేరకు పన్నుల భారం తగ్గి వినియోగదారుడి నుంచి వసూలు చేసే ఎమ్మార్పీ ధర కూడా తగ్గాలి. అయితే ప్రభుత్వం మాత్రం పన్నులను తగ్గించి.. ఎమ్మార్పీలో తేడా లేకుండా ఉండేందుకు వీలుగా ఆ వ్యత్యాసాన్ని ప్రత్యేక మార్జిన్‌ రేటు రూపంలో వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

ఏపీఎస్‌బీసీఎల్‌కు లబ్ధి ఎలా

మద్యం విక్రయాల వల్ల ఏపీఎస్‌బీసీఎల్‌కు 10 శాతం మార్జిన్‌ ఉంటుంది. అందులో 6 శాతం నిర్వహణ ఖర్చులకు పోగా, మిగతా 4 శాతం ఆ సంస్థకు లాభం. ఉదాహరణకు వంద రూపాయిల విలువైన మద్యం అమ్మితే కార్పొరేషన్‌కు రూ.10 మిగిలేది. మిగతాది సొమ్ము మద్యం తయారీదారులతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్లేది.

* వ్యాట్‌ తగ్గించటం వల్ల ఏపీఎస్‌బీసీఎల్‌ వివిధ కేటగిరీల మద్యంపై ఇప్పటివరకూ చెల్లిస్తున్న మొత్తంలో 95 శాతం నుంచి 130 శాతం వరకూ తగ్గింది. ఆ మొత్తాన్ని స్పెషల్‌ మార్జిన్‌ రేటు రూపంలో కొర్పొరేషన్‌ పొందనుంది. ఈ లెక్కన అంత శాతం మేర మార్జిన్‌ దీనికి లభించనుంది.

* 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20,189 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. అందులో 10 శాతం అంటే గతంలో ఏపీఎస్‌బీసీఎల్‌కు రూ.2 వేల కోట్ల మేర మాత్రమే మార్జిన్‌ ఉండేది. అందులోనే నిర్వహణ ఖర్చులూ అన్నీ ఉండేవి. తాజా మార్పుల వల్ల ఇకపై 95 శాతానికి పైగా మార్జిన్‌ ఉండటం వల్ల ఆ మేరకు విక్రయ విలువలో సింహభాగం ఆదాయం ఏపీఎస్‌బీసీఎల్‌కే సమకూరనుంది.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా చంద్రశేఖర్ అయ్యర్‌ కొనసాగింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.