ETV Bharat / city

తెలంగాణ: ధరణిలో ఆధార్ వివరాలు అడగటం తప్పేమీ కాదు: ప్రభుత్వం - ధరణి పోర్టల్​

ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ధరణి ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, ఆస్తి మార్పిడి కోసం అవసరమైన చట్ట సవరణలు చేసినట్లు వివరించింది. వ్యవసాయేతర భూముల యజమానులు ఆధార్ వివరాల నమోదు ఐచ్ఛికమేనని.. సాగుభూముల యాజమానులు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కులం వివరాలు అడగబోమని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజిక వర్గం వివరాలు సేకరిస్తామని పేర్కొంది. సేకరించిన వివరాలపై గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.

government counter-filed in the High Court on the registration of assets
ధరణిలో ఆధార్ వివరాలు అడగటం తప్పేమీ కాదు: ప్రభుత్వం
author img

By

Published : Nov 22, 2020, 7:03 AM IST

స్థిరాస్తుల వివరాలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి అవినీతిని నిర్మూలించే లక్ష్యంతోనే ధరణిని రూపొందించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రజల వ్యక్తిగత ఆస్తుల హక్కులను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన పరిపాలన సంస్కరణల్లో భాగమే ధరణి అని ప్రభుత్వం వివరించింది. ధరణి డిజిటల్ వేదిక వల్ల రిజిస్ట్రేషన్లు, ఆస్తి మార్పిడిలో మోసాలు, అవినీతి ఆస్కారం ఉండదని పేర్కొంది. అధికారులకు విచక్షణ అధికారం ఉండదని తెలిపింది. ధరణిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, ఆస్తి మార్పిడికి చట్టబద్ధత కోసం రెవెన్యూ, పంచాయతీ, పురపాలక, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణ చేసినట్లు ప్రభుత్వం నివేదించింది.

ఆధార్​ వివరాలు తప్పనిసరేమీ కాదు...

ధరణిలో కులం వివరాలు అడగమని.. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజిక వర్గాల వివరాలు మాత్రమే నమోదు చేస్తామని తెలిపింది. వ్యవసాయేతర ఆస్తుల యజమానులు ఆధార్ వివరాలు ఇవ్వడం తప్పనిసరేమీ కాదని.. ఐచ్ఛికమేనని స్పష్టత నిచ్చింది. సాగునీటి భూముల యజమానులు మాత్రం కచ్చితంగా ఆధార్ వివరాలు ఇవ్వాల్సిందేనని తెలిపింది. వ్యవసాయ భూములకు రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్ వివరాలు అడగటం తప్పేమీ కాదని వివరించింది. వ్యక్తిగత వివరాలు అందరికీ కనిపించకుండా దాచుకోవడానికి కూడా ధరణిలో ఆప్షన్ ఉందని పేర్కొంది.

మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలి..

ధరణి ద్వారా సేకరించిన వివరాలన్నీ ప్రభుత్వం ఆధీనంలోని రాష్ట్ర డేటా సెంటర్​లో అత్యంత భద్రంగా ఉంటాయని తెలంగాణ సర్కారు భరోసా ఇచ్చింది. భద్రత పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కౌంటరులో సీఎస్ వివరించారు. రికార్డుల నిర్వహణలో సౌలభ్యం, పారదర్శకతే లక్ష్యంగా రూపొందించిన ధరణి ఉద్దేశాలను పిటిషనర్లు అర్థం చేసుకోలేదని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని.. వ్యాజ్యాలను కొట్టివేయాలని ప్రభుత్వం కోరింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగనుంది.

ఇవీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల 'ధరణి' రిజిస్ట్రేషన్ ఆలస్యమయ్యే అవకాశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.