ETV Bharat / city

STEEL PLANT: 'విశాఖ ఉక్కుపై పునరాలోచించాలి' - vizag steel plant privatization

విశాఖ ఉక్కు పరిశ్రమను లాభాలబాట పట్టించే ప్రత్యామ్నాయాలను కేంద్రం పునఃపరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. విశాఖ ఉక్కుకు పునరుజ్జీవనం చేసేందుకు పలు సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి 3 లేఖలు రాశారని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం లేవనెత్తిన అంశాలను కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వె‌ల్లడించలేదని తెలిపింది. తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
author img

By

Published : Aug 22, 2021, 6:30 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ హైకోర్టులో వాజ్యం వేశారు. ఆ వాజ్యంపై న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్​ అఫిడవిట్ వేశారు. విశాఖ ఉక్కు దేశంలో సముద్ర తీరాన ఉన్న మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ అని.. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అని పేర్కొన్నారు. 20 వేల మందికిపైగా నేరుగా, అనేక మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అఫిడవిట్‌లో తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పలువురు త్యాగాలు చేశారని 32 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి ప్రత్యామ్నాయాలను చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 6న ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమకు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుందన్నారు. పరిశ్రమకు సొంతంగా క్యాప్టివ్ మైనింగ్ గనులు లేకపోవడంతో ఉక్కు ఉత్పత్తికి అధిక ఖర్చు అవుతోందన్నారు. ఆ ప్రభావం లాభాలపై పడుతోందని తెలిపారు. ప్లాంట్‌ను పూర్వస్థితికి తెచ్చేందుకు అవకాశాలను అన్వేషించాలని, పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని.. కేంద్ర పెట్రోలియం సహజవాయువు, ఉక్కుశాఖ మంత్రికి ముఖ్యమంత్రి ఫిబ్రవరి 26 న లేఖ రాసినట్లు ఏపీ సర్కార్‌ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ఆర్థికమంత్రి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి మార్చి 8న ప్రకటన చేసిన తర్వాత మార్చి 9న ప్రధానికి సీఎం జగన్‌ మరోలేఖ రాశారని కరికాల వళవన్‌ అఫిపడవిట్‌లో తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ ఈ ఏడాది మే 20న తీర్మానం చేసిందన్నారు. ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారం.. ఆయా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు. ఒక్కో కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలని అఫడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇనుప ఖనిజం గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి నెలకు 200 కోట్ల రూపాయల లాభాల్ని ఆర్జించగలుగుతుందని అఫిడవిట్‌లో తెలిపింది.

ఇదీచదవండి.

study survey : తెలుగు రాయలేరు... ఆంగ్లం చదవలేరు... లెక్కలు చేయలేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.