ETV Bharat / city

sajjala:47 కార్పొరేషన్లకు 481 మంది నియామకం: సజ్జల రామకృష్ణారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలోని 47 కార్పొరేషన్లలో 481 మంది డైరెక్టర్లను నియమించినట్లు రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో మహిళలకు 52%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 58% (వీరిలోనూ మహిళలుంటారు) అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

47 కార్పొరేషన్లకు 481 మంది నియామకం
47 కార్పొరేషన్లకు 481 మంది నియామకం
author img

By

Published : Sep 5, 2021, 4:39 AM IST

రాష్ట్రంలోని 47 కార్పొరేషన్లలో 481 మంది డైరెక్టర్లను నియమించినట్లు రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో మహిళలకు 52%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 58% (వీరిలోనూ మహిళలుంటారు) అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణలతో కలిసి శనివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ల జాబితాను సజ్జల ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎంపిక క్లిష్టంగా కొనసాగింది. అయినా సమతుల్యత పాటించాం. కొన్ని కులాల్లో అభ్యర్థులను వెతికి పట్టుకోవాల్సి వచ్చింది.

బీసీలకు ప్రాధాన్యమిచ్చాం. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఈ వర్గాలను భ్రమల్లో పెట్టి మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూసింది. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చాక 15 మందిని ఎమ్మెల్సీలను చేస్తే వారిలో 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలున్నారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థల పదవుల్లోనూ సగానికి పైగా, అలాగే ఇటీవల ఇచ్చిన 137 నామినేటెడ్‌ పదవుల్లో 58% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం. సచివాలయాల ఉద్యోగాల్లోనూ 83% ఈ వర్గాలవారే’ అని పేర్కొన్నారు.
హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి కాబట్టే డైరెక్టర్లలో 52% పదవులను మహిళలకే ఇచ్చారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే మాటలను ఆయన చేతల్లో చూపుతున్నారు. అంబేడ్కర్‌ కోరుకున్న సమసమాజ స్థాపన జగన్‌ హయాంలోనే జరుగుతోంది’ అని తెలిపారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నగదు బదిలీ పథకం (డీబీటీ), నాన్‌ డీబీటీ పథకాల కింద బీసీలకు రూ.63వేల కోట్లు, ఎస్సీలకు 24వేల కోట్లు, ఎస్టీలు, మైనారిటీలకు రూ.7వేల కోట్ల చొప్పున ఇప్పటివరకూ లబ్ధి చేకూరింది.

రాజకీయాలు అందని ద్రాక్షగా మారిన వర్గాలకు ఇప్పుడు పదవుల్లో ప్రాధాన్యమిచ్చి ముఖ్యమంత్రి సామాజిక న్యాయం పాటిస్తున్నారు’ అని తెలిపారు. ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులూ మాట్లాడారు.

ఇదీ చదవండి:

ఇప్పటివరకు రూ.లక్షా 27 వేల కోట్లు అప్పు: ఆర్థికమంత్రి బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.