Dr Nori meets CM Jagan: ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం జగన్ను కలిశారు. క్యాన్సర్ నివారణ, అత్యాధునిక చికిత్స విధానాలపై చర్చించారు. అన్ని సౌకర్యాలతో క్యాన్సర్ ఆస్పత్రులు నిర్మించాలన్న సీఎం సూచనలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
క్యాన్సర్ చికిత్సకు రాష్ట్రంలో 3 చోట్ల ఆస్పత్రులు కట్టాలని నిర్ణయించారు. ఒకచోట అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి పేదవాడికీ క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండేలా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? - చంద్రబాబు