సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రక్తదాన కార్యక్రమానికి....వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో రాష్ట్రంలో వైద్య రంగానికి బాసటగా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. సోమవారం రాత్రి 7 గంటల వరకూ 34 వేల 723 వేల యూనిట్ల రక్తదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, రోటరీరెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్, సహా పలు ఎన్జీఓలు రక్తదాన స్వీకరణ చేపట్టాయి.
ఇదీ చదవండి
'విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డవారు స్వచ్ఛందంగా తిరిగిచ్చేయాలి'