తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో మధ్యాహ్నం సుడిగాలి వీచింది. ఒక్కసారిగా గాలి రావడంతో మైదానంలోని దుమ్ము, ధూళి సుడిగాలిలా తిరుగుతూ పైకి లేచింది. మైదానంలోని క్రికెట్ క్రీడాకారులతో పాటు.. ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా క్రీడా మైదానం బయటకు పరుగులు పెట్టారు.
నిమిషం అనంతరం సుడిగాలి తగ్గిపోవడంతో క్రీడాకారులు, ప్రేక్షకులు, నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. తదనంతరం క్రీడా పోటీలు యధావిధిగా కొనసాగాయి. గతంలో ఇలాగే ఒక్కసారి సుడిగాలి వీచిందని స్థానికులు తెలిపారు. సుమారు నిమిషం పాటు సాగిన ఈ అద్భుతమైన సన్నివేశం చూపరులను ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: