ETV Bharat / city

ఎయిర్​గన్​ మిస్ ఫైర్.. బాలిక మృతి..! - ఎయిర్​గన్​ మిస్​ఫైర్​

Airgun Misfire: ఎయిర్​గన్​ పేలి ఒక బాలిక మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆడుకుంటుండగా గన్​ పేలి బాలిక తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

Airgun Misfire
ఎయిర్​గన్​ పేలి బాలిక మృతి
author img

By

Published : Mar 16, 2022, 12:24 PM IST

Airgun Misfire: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రసాద్​ ఫాంహౌస్​లో ఎయిర్​గన్​ పేలి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మార్చి మంగళవారం జరిగింది.

ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల బాలిక శాండ్వి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పిల్లలు ఆడుకుంటుండగా ఎయిర్​గన్​ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి: "ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది... లేకుంటే బతికేది"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.