ETV Bharat / city

తెలంగాణ: గ్రేటర్ నగారా.. డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు - జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​

తెలంగాణలోని.. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎస్​ఈసీ పార్ఠసారథి తెలిపారు. డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 4న జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పదవి మహిళ(జనరల్)కు కేటాయించినట్లు పేర్కొన్న ఎస్​ఈసీ... బ్యాలెట్​ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ghmc notification
ghmc notification
author img

By

Published : Nov 17, 2020, 11:54 AM IST

ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్న అధికారులు... 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. డిసెంబర్ 1న ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్​ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

ghmc notification
గ్రేటర్ నగారా.. డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

రిజర్వేషన్లు...

  • జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్టీ-2(జనరల్‌ 1, మహిళ1)
  • జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్సీ-10‍‌(జనరల్‌ 5, మహిళలు 5)
  • జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: బీసీ-50(జనరల్‌ 25, మహిళలు 25)
  • జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు: జనరల్ మహిళ-44, జనరల్-44

పోలింగ్​ కేంద్రాలు...

  • గ్రేటర్ పరిధిలో 1,439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
  • గ్రేటర్‌లో 1,004 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
  • గ్రేటర్‌లో 257 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం

ఇదీ చూడండి:

కొత్త జిల్లాల ప్రకటన వచ్చిన 2 వారాల్లోగానే విభజన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.