రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సుస్థిర ఉపాధి కల్పనకు 2020-21 ఏడాదికి ప్రభుత్వం రూ.20 వేల కోట్ల రుణాల మంజూరును లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందులో రూ. 15 వేల కోట్లు బ్యాంకుల ద్వారా మంజూరు చేయనుండగా ఇప్పటికే సంఘ సభ్యుల పొదుపు ఖాతాల్లో ఉన్న మరో రూ.5 వేల కోట్లను స్వయం ఉపాధి ఏర్పాటుకు అందించనుంది. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను పక్కాగా ఉపాధి కోసమే వినియోగించుకుని వారు ఆర్థికంగా పురోభివృద్ధి చెందేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఉపాధి కొలువుతీరేందుకు అవసరమైన వనరులు సమాకూర్చనుంది. స్వయం ఉపాధిని జియో ట్యాగింగ్ చేయనుంది. డ్వాక్రా మహిళల ఉపాధి కల్పన బాధ్యతను కమ్యూనిటీ కొఆర్డినేటర్ల(సీసీ)కు అప్పగించింది. వీరు రుణాల మంజూరు నుంచి ఉపాధి గ్రౌండింగ్ అయ్యే వరకు సమన్వయం చేస్తారు. తర్వాత నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు.
ఏదైనా కారణంతో ఉపాధి ఆగిపోతే ఆ వివరాలు ఉన్నతాధికారులను నివేదిస్తారు. యానిమేటర్లు సంఘ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. రుణ మంజూరుకు వీలుగా ప్రభుత్వం కుటుంబ పెట్టుబడి అవకాశాల సర్వే నిర్వహిస్తోంది. ప్రతి సభ్యురాలి వద్దకు వెళ్లి వారి కుటుంబ జీవనోపాధి వివరాలు అధికారులు నమోదు చేస్తున్నారు. రుణాల మంజూరు వివరాల నమోదుకు వెబ్సైట్ ఏర్పాటు చేస్తారు.
ఇదీ చదవండి: