ETV Bharat / city

cm jagan - gautam adani: సీఎం జగన్​తో గౌతమ్ అదానీ భేటీ.. పెట్టుబడులపై చర్చ - అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ

ముఖ్యమంత్రి జగన్​తో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు(gautam adani met cm ys jagan news). రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో.. రాష్ట్రంలో పలు పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

gautam adani met cm ys jagan
gautam adani met cm ys jagan
author img

By

Published : Nov 20, 2021, 7:33 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​తో అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ భేటీ అయ్యారు(gautam adani met cm ys jagan ). ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఆయన కొద్దిసేపు విజయవాడలో బస చేసి అనంతరం సీఎంతో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అదానీ రెండు గంటలపాటు సీఎంతో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

విశాఖలో ఏర్పాటు చేయనున్న అదానీ డేటా సెంటర్ అంశంతో పాటు గంగవరం పోర్టు ప్రస్తుతం అదానీ గ్రూప్ సంస్థల పరిధిలోకి వెళ్లటంతో సదరు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ (Solar Energy Corporation of India)నుంచి కొనుగోలు చేయనున్న సౌర విద్యుత్ అదానీ గ్రూప్ సరఫరా చేయనున్న నేపథ్యంలో దానిపై కూడా ఇరువురి మధ్యా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమనానంలో బయల్దేరి వెళ్లారు.

ఇదీ చదవండి:

Junior NTR: ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది..: జూనియర్ ఎన్టీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.