ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా... గుట్కా, మద్యం, నాటుసారా దందాలపై పోలీసుల ఉక్కుపాదం

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గుట్కా తరలింపు, అక్రమ మద్యం, నాటుసారా రవాణాపై ఎస్​ఈబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిషేధిత గుట్కా, మాదక ద్రవ్యాల తరలింపు, వాటిని విక్రయిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేశారు.

seb raids
ఎస్​ఈబీ అధికారుల దాడులు
author img

By

Published : Jun 26, 2021, 9:25 AM IST

అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేశారు. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. దాదాపు 3 బస్సుల్లో హైదరాబాద్, తిరుపతి ప్రయాణిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 99.5 కేజీల గంజాయి, 4 లీటర్ల ద్రవరూప గంజాయి, 900 గ్రాముల చెరాస్​ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.12 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్ఈబీ, టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితులపై మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

200 కేజీల గంజాయి స్వాధీనం..

విశాఖ మన్యం నుంచి కేరళకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని తూర్పుగోదావరి జిల్లా తునిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 4 లక్షలు విలువైన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా గమనించిన నిందితులు.. గంజాయి తరలిస్తున్న వ్యాన్​ని వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అప్రమత్తమై పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉల్లిపాయల ఆటోలో గుట్కా తరలింపు..

ఉల్లిపాయల సంచుల కింద గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దర్నీ పాణ్యం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా నిషేధిత గుట్కాను గుర్తించారు. పట్టుబడిన గుట్కా విలువ రూ.3.15 లక్షల ఉంటుందని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.

పెట్ బాటిళ్లలో నాటుసారా విక్రయం...

గుంటూరు జిల్లా తెనాలి.. మండలం బుర్రిపాలెంలోని ఓ ఇంట్లో నిల్వ ఉన్న 20 లీటర్ల నాటుసారాను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. పెట్ వాటర్ బాటిల్స్​లో నాటుసారా నింపి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఎస్ఈబీ సీఐ తిరుపతయ్య తెలిపారు. నిషేధిత గుట్కాను ఎవరు విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కాలు, గంజాయి అమ్మినట్లు తెలిస్తే తమ టోల్ ఫ్రీ నెంబర్​కి సమాచారం ఇవ్వాలని అన్నారు.

హిందూపురం మండలంలో విస్తృత తనిఖీలు..

అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో ఎస్ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో మట్కా నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మట్కా చీటీలు, రూ.8 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు.

మండలంలోని తూముకుంట వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లు, అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కర్ణాటక మద్యం ప్యాకెట్లు, రూ.1900 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలుంటాయని ఎస్ఈబీ అధికారులు హెచ్చరించారు.

రోడ్డుపై నిలిపిన ద్విచక్ర వాహనంలో గంజాయి గుర్తింపు..

ఈ నెల 22న కృష్ణా జిల్లా కేసరపల్లి జాతీయ రహదారిపై నిలిపిన ద్విచక్ర వాహనంలో 6 కిలోల గంజాయిని పహారా పోలీసులు గుర్తించారు. సదరు వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ఆర్టీఏ సహకారంతో నిందితుడు తెనాలి మండలం సంగం జాగర్లకు చెందిన మహమ్మద్ రఫీగా గుర్తించారు. పోలీసు పహారాను చూసి సదరు వ్యక్తి వాహనాన్ని వదిలి వెళ్లి ఉంటాడని గన్నవరం పోలీసులు భావించారు. సాంకేతిక పరిజ్ఞానానం ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గంతంలోను రఫీపై తెనాలి పోలీస్ స్టేషన్లలలో 8 దొంగతనం కేసులు, గంజాయి అక్రమ రవాణా కేసులు ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:

మాయమాటలతో మోసాలు... పోలీసుల అదుపులో నిందితుడు!

సామాన్యుడిపై మరోసారి పెట్రో పిడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.