Jubilee Hills Case updates: తెలంగాణ వ్యాప్తంగా సంచలం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు బాలురు బెయిల్‌పై విడుదలయ్యారు. వారికి నిన్న నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి వారు విడుదలయ్యారు. మరో బాలుడికి బెయిల్ మంజూరైనా కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగింది.
నేడు బెయిల్‌పై మరో బాలుడు విడుదల కానున్నాడు. ఈ రోజు హైకోర్టులో మరో బాలుడి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మే28న జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు బాలురతో పాటు సాదుద్దీన్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: