ETV Bharat / city

gang rape:ఇల్లు ఇప్పిస్తామంటూ.. ఓ యువతిపై అత్యాచారం - ఉత్తరప్రదేశ్‌

'ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన' కింద ఇల్లు ఇప్పిస్తామంటూ.. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్​నగర్​ జిల్లా భోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

gang rape
gang rape
author img

By

Published : Oct 10, 2021, 5:30 PM IST

కామాంధుల అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి ఏదోవిధంగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్​నగర్​ జిల్లా భోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

'ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన' కింద ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు యువకులు(యోగేశ్‌ కుమార్, బబ్లు).. ఓ యువతి (22)పై అత్యాచారానికి తెగబడ్డారు. వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనను నిందితుల్లో ఒకరు రికార్డు చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

అనంతరం ఆ వీడియోతో యువతిని వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వీడియో తొలగిస్తానని చెప్పి.. మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకుండా మళ్లీ మళ్లీ బెదిరింపులు వస్తుండడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని భోపా పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: SUICIDE : పెళ్లయిన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య... కారణమేంటంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.