హైదరాబాద్ మేయర్‌గా బంజారాహిల్స్ తెరాస కార్పొరేటర్, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పదవి కోసం భాజపా తరఫున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధాధీరజ్‌రెడ్డి నామినేషన్ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.
మేయర్ ఎన్నికలో ఎంఐఎం కూడా తెరాస అభ్యర్థికే మద్దతు తెలిపింది. డిప్యూటీ మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్, డిప్యూటి మేయర్ పదవులను తెరాస కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి. పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న ఏపీ...