ETV Bharat / city

సౌర ప్రాజెక్టులతో విద్యుత్​ ధరలు తగ్గే అవకాశం...! - ఏపీలో ఉచిత విద్యుత్ వార్తలు

సౌర విద్యుత్‌ ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని న్యాయ సమీక్ష కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత సమాచారం ప్రకారం మున్ముందు ఒక రూపాయికే యూనిట్‌ లభించే అవకాశముందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సంస్థలతో కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది.

power
power
author img

By

Published : Nov 12, 2020, 8:44 AM IST

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను న్యాయ సమీక్ష కమిటీ బుధవారం ఆమోదించింది. టెండర్ల ప్రక్రియ నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది. ప్రతిపాదించిన 10వేల మెగావాట్ల ప్రాజెక్టుల్లో.. మొదటి దశలో 6,400 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈఎల్‌) చేపట్టింది. టెండరు నిబంధనలను న్యాయ సమీక్షకు పంపింది. వాటిపై వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం టెండర్ల ప్రక్రియను నిర్వహించటానికి కమిటీ పలు సూచనలు, వ్యాఖ్యలు చేసింది.

* రాష్ట్రంలో అవసరాలకు మించి విద్యుత్‌ ప్రాజెక్టులున్నాయని, ఇలాంటి సమయంలో కొత్తగా 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులు ఎందుకని వివిధ సంస్థలు కమిటీకి ఫిర్యాదు చేశాయి. ‘ప్రస్తుతం డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏల ప్రకారమే విద్యుత్‌ను కొనాల్సి ఉంది. అలాంటప్పుడు అదనంగా వచ్చే విద్యుత్‌ను ఎక్కడ వినియోగిస్తారు? డిస్కంల దగ్గర మిగిలిపోయే విద్యుత్‌ను సర్దుబాటు చేయటానికి ఎలాంటి విధానాలు ఉన్నాయి?’ అని అధికారులను కమిటీ ప్రశ్నించింది. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయటానికి రెండేళ్లు పడుతుందని, ఈలోగా కొన్ని పాత పీపీఏల కాల వ్యవధి ముగుస్తుందని, ఏటా కనీసం 10% విద్యుత్‌ వినియోగ డిమాండ్​ పెరుగుతుందని అధికారులు వివరించారు.

* కనీసం 300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేసే సంస్థలకే టెండరులో పాల్గొనే అవకాశం కల్పించాలని నిబంధనల్లో అధికారులు పేర్కొన్నారు. దీని ప్రకారం భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకే అవకాశం ఉంటుంది కదా? అని కమిటీ ప్రశ్నించింది.

* 30 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును కనీస ధరకు కాకుండా, ఉచితంగానే ప్రభుత్వ సంస్థకు ఇవ్వాలనే నిబంధనను కమిటీ విధించింది.

* టెండరులో పాల్గొనే సంస్థలకు అనుభవం ఉండాలనే నిబంధనను అధికారులు విధించలేదు. కమిటీ మాత్రం కనీసం 25 మెగావాట్ల ప్రాజెక్టును నిర్వహించిన అనుభవం ఉండాలంది.

ఇదీ చదవండి :

మే నాటికి పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.