ETV Bharat / city

లైవ్​ వీడియో: ట్రాక్టర్ బీభత్సం... నలుగురికి గాయాలు - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శివారులో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ట్రాక్టర్ బీభత్సం
ట్రాక్టర్ బీభత్సం
author img

By

Published : Mar 6, 2021, 10:01 PM IST

లైవ్​ వీడియో: ట్రాక్టర్ బీభత్సం... నలుగురికి గాయాలు

తెలంగాణ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ పలువురిని ఆస్పత్రి పాలు చేసింది. మెట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ట్రాక్టర్‌.... అదుపుతప్పి ఒక్కసారిగా వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు రోడ్డుపక్కనున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైక్​పై వెళ్తున్న ఓ కుటుంబం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.

ఇదీ చదవండి:

'చట్టాల సవరణకు సిద్ధం- విపక్షాలది రాజకీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.