ETV Bharat / city

కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఐదుగురు మృతి - Road accident at menur

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి ఆటో రాంగ్​ రూట్​లో రావడమే కారణమని స్థానికులుంటున్నారు.

1
1
author img

By

Published : Jul 18, 2022, 5:39 PM IST

Updated : Jul 18, 2022, 6:38 PM IST

Road accident at menur: కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మద్నూరు మండలం మేనూర్‌ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాంగ్ రూట్‌లో వచ్చిన ఆటో.. లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జయింది.

ప్రమాదం జరిగిందిలా..: కంటైనర్‌ లారీ హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వెళ్తోంది. మరోవైపు ఆటో మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తోంది. ఈ క్రమంలోనే అదుపుతప్పిన ఆటో.. ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీ కిందకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. కంటైనర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jul 18, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.