ETV Bharat / city

కందిరీగలు కుట్టి.. తెలంగాణలో వ్యక్తి మృతి - mamnoor crime news

వారంతా ఒకప్పుడు కలసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. చిన్ననాటి మిత్రులతో ఓ చక్కటి కార్యక్రమం నిర్వహించి సరదాగా గడపాలనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. పూర్వ సమ్మేళనం జరుగుతుండగా చుట్టుముట్టిన కందిరీగలు.. ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది.

died
కందిరీగల దాడితో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Apr 12, 2021, 1:19 PM IST

తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్‌ మండలం మామునూరు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో విషాదం చోటుచేసుంది. వంట చేస్తుండగా తేనెటీగల దాడిలో ఓ పూర్వ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌ 2000-01 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.

ఆ బ్యాచ్‌కు చెందిన 60 మంది విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనాలు వండేందుకని కట్టెల పొయ్యి వెలిగించగా సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు వారిపైకి ఎగబట్టాడు. ఖిలా వరంగల్‌ పడమరకోటకు చెందిన మైదం దయాకర్‌ (35)కు తేనెటీగలు కుట్టి తీవ్ర గాయాలు కావడం వల్ల... వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఉపాధ్యాయుడు వెంకటరామయ్య, విద్యార్థులు సతీష్‌, సురేష్‌... బెటాలియన్‌ యూనిట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

ఇదీ చూడండి:

బాలుడిని బెదిరించి.. బంగారు ఆభరణాల దుకాణంలో నగదు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.